Tuesday, November 5, 2024

మెడికల్ సీట్ల స్కాంలో దర్యాప్తు ముమ్మరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు. సీట్లను బ్లాక్ చేసి, రూ.కోట్లలో ఆ సీట్లను విక్రయిస్తున్నారు. దీనికి సంబంధించిన 12 మెడికల్ కాలోజీల్లో ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. తాజాాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీ యాజమా న్యాలకు నోటీసులివ్వనున్నట్లు ఇడి అధికారులు వెల్లడించారు. పీజీ మెడికల్ సీట్ల కుంభకోణంలో ఇడి అధికారుల దర్యాప్తు కొనసాగు తోంది. కొన్ని మెడికల్ కళాశాలలు పీజీ సీట్లను విక్రయించి 100కోట్లకు పైగా సొమ్ముచేసుకున్నట్లు ఇడి అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ మేరకు ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గత నెలలో ఇడి అధికారులు 12 మెడికల్ కాలేజీలకు సంబంధించి 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి వైద్య కళాశాలలో నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును ప్రీజ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 12వైద్య కళాశాలలు పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసి, ఆ తర్వాత వాటికి ఉన్న డిమాండ్ ను బట్టి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఇడి అధికారులు తేల్చారు. ఈ మేరకు ఆయా కళాశాలలకు చెందిన బ్యాంకు ఖాతాలను పరిశీలించినప్పుడు నగదు లావాదేవీలు బయటపడ్డాయి. ఈ డబ్బును కళాశాలల యాజమాన్యాలు సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు అధికారులు గుర్తించారు.

2016 నుంచి 2022 సంవత్సరం వరకు పిజి మెడికల్ సీట్లు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు తేల్చారు. కాళోజీ యూనివర్శిటీ రిజిస్ట్రార్ గతేడాది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా ఇడి అధికారులు మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్య కళాశాలలకు చెందిన యాజమాన్యాలకు ఇడి అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. కళాశాలల బ్యాంకుఖాతాలతో పాటు యాజమాన్యాలకు చెందిన వ్యక్తిగత ఖాతాలను ఇడి అధికారులు పరిశీలించనున్నారు. మనీలాండరింగ్ జరిగినట్లు నిర్ధారణ చేసుకున్న తర్వాత తదనుగుణంగా ఇడి అధికారులు చట్టప్రకారం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News