- సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట: ఐటి టవర్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం ఐటి టవర్‌లో ఐటిటవర్ భవనం యొక్క నిర్వహణ, టిఎస్‌ఐఐసి నిర్మాణ ఏజెన్సీ, ఐటి కంపెనీ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటి ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అత్యంత అదునాతన పద్దతిలో అతి స్వల్ప కాలంలో భవనం నిర్మించుకున్నామన్నారు. ఐటి టవర్ సివిల్ పనులు 100 శాతం పూర్తయినట్లు తెలిపారు. నిర్వహనలో భాగంగా వాటర్ సప్ల, ఎలక్ట్రీసీటి గురించి చర్చించారు.
మిషన్ భగిరథ వాటర్‌ను లక్ష సామర్థం గల సంపును నిర్మించనున్నామన్నారు. సెక్యూరిటీ, సూపర్ వైజర్లు , స్వీపర్లు అందరిని సమకూర్చుకోవాలని ఐటి టవర్ ప్రాంతం మొత్తం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నిర్వహణలో అన్ని సదుపాయాలు కల్పించి సాప్ట్ వేర్ కంపెనీలకు కార్యాలయాన్ని అందజేయాలని టిఎస్‌ఐఐసి నిర్మాణ ఏజెన్సీలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఐఐసి జోనల్ మేనేజర్ మాదవి, ఆర్‌ఎన్ కన్‌స్ట్రక్షన్స్ బాపీనీడు, సాప్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.