Thursday, January 23, 2025

జర్నీ ఆఫ్ విశ్వం

- Advertisement -
- Advertisement -

మాచో స్టార్ గోపీచంద్, స్టైలిష్ డైరెక్టర్ శ్రీను వైట్ల అప్ కమింగ్ మూవీ విశ్వం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. మేకర్స్- ది జర్నీ ఆఫ్ విశ్వం అనే వీడియోతో ప్రమోషన్స్‌ని ప్రారంభించారు. ఆడియన్స్‌లో ఆసక్తిని కలిగిస్తూ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో తెలియజేసేలా ఈ వీడియోని అద్భుతంగా డిజైన్ చేశారు. వండర్‌ఫుల్ విజువల్స్, డైనమిక్ అండ్ స్టైలిష్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సన్నివేశాలు ఈ వీడియోలో వున్నాయి. ప్రేక్షకులను అలరించే ముఖ్యమైన హ్యుమర్ సీక్వెన్ వుంది. అలాగే ప్రేక్షకులని సీట్ ఎడ్జ్‌లో ఉంచే ఆడ్రినలిన్- పంపింగ్ మూమెంట్స్ వున్నాయి.

శ్రీను వైట్ల మార్క్ హ్యుమర్… యాక్షన్, కామెడీని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తోంది. గోపీచంద్ యాక్టింగ్, స్టైలిష్ ఇంటెన్స్ రెండింట్లో అదరగొడతారు. తన క్యారెక్టర్ లో హ్యుమర్ ఎలిమెంట్స్ వున్నాయి. కావ్యా థాపర్ లీడింగ్ లేడీగా పరిచయమైంది. మొత్తంమీద ది జర్నీ ఆఫ్ విశ్వం అద్భుతమైన లోకేషన్స్, హై-ఆక్టేన్ యాక్షన్, హిలేరియస్ హ్యుమర్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News