Monday, December 23, 2024

రాహుల్‌ను దోషిగా నిర్థారించిన జడ్జికి పదోన్నతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గుజరాత్‌లో 68 మంది జుడిషియల్ అధికారులకు పదోన్నతుల వ్యవహారంపై దాఖలు అయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం ( 7వ తేదీ) విచారణ నిర్వహిస్తుంది. పదోన్నతులు పొందిన వారిలో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ హరీష్ హస్ముఖంభాయ్ వర్మ కూడా ఉన్నారు. ప్రతిభ సీనియార్టీలతో నిమిత్తం లేకుండా పలువురికి ఏకబిగిన పదోన్నతులు చోటుచేసుకున్నాయని వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. ప్రత్యేకించి సూరత్ జడ్జికి ప్రమోషన్ ఇవ్వడం వివాదాస్పదం అయింది. కొందరు న్యాయమూర్తులు ఈ పదోన్నతులను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. దీనితో సుప్రీంకోర్టు విచారణకు తేదీ ఖరారు అయింది. అత్యున్నత న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి, గుజరాత్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఇప్పటికే నోటీసు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News