చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిపాలు కావడానికి, ఆ తర్వాత చనిపోవడానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరిపిన జస్టిస్ ఏ.ఆరుముగస్వామి కమిషన్ వి.కె.శశికళ, డాక్టర్ కె.ఎస్. శివకుమార్, నాటి ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయభాస్కర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి జె. రాధాకృష్ణన్ లపై దర్యాప్తు చేయాలని సిఫారసు చేసింది. జయలలిత మరణంపై 500 పేజీల నివేదికను సమర్పించింది. డాక్టర్లు సిఫారసు చేసినప్పటికీ జయలలితకు యాంజియోప్లాస్టీ ఎందుకు జరపలేదని, ఇంగ్లాండ్‌కు చెందిన డాక్టర్ రిచర్డ్ సూచించినప్పటికీ జయలలితను చికిత్స కోసం విదేశాలకు ఎందుకు విమానంలో తరలించలేదని కూడా కమిషన్ ప్రశ్నించింది. చెన్నై అపోలో ఆసుపత్రి అందించిన చికిత్సపై అనుమానాలు వ్యక్తం చేసింది. 2011లో పార్టీ నుంచి వెలివేసినప్పటి నుంచి శశికళకు, జయలలితకు మధ్య సంబంధాలు చెడ్డాయని, అయినప్పటికీ 2012 మార్చిలో పోయస్ గార్డెన్‌లోకి ఆమెను అనుమతించారని కమిషన్ పేర్కొంది. జయలలిత మొదటి అంతస్తులో స్పృహ కోల్పోయాక ఆమెను పోయస్ గార్డెన్ నివాసం నుంచి అపోలో ఆసుపత్రికి తరలించిడంలో శశికళ, ఇతరుల తప్పు ఏమిలేదని కూడా కమిషన్ పేర్కొంది.
అపోలో ఆసుపత్రిలో 2016 సెప్టెంబర్ 22న చేరిన జయలలిత డిసెంబర్ 5న గుండెపోటుతో మరణించింది. ఆమె మరణం అనేక వివాదాలకు దారితీసింది. ఆమె పార్టీ సహచరులు, ప్రధానంగా పన్నీర్ సెల్వం ఆమె చికిత్సపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదో కుట్ర జరిగిందన్నారు. అందులో వికె. శశికళ పాత్ర కూడా ఉందన్నారు.
జయలలిత మరణం కేసులో శశికళ పేరును పేర్కొన్న దర్యాప్తు కమిషన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -