Sunday, December 22, 2024

రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’..

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ లో ఇటీవల విడుదలై సంచలన విజయంతో దూసుకుపోతున్న చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’. కేవలం 8రోజుల్లోనే రూ.100కోట్ల రికార్డు కలెక్షన్స్ వసూళ్ చేసిన ఈ మూవీపై ప్రేక్షకులు, సినీ క్రిటిక్స్, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ తదితరులు నటించిన ఈ సినిమాకు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించగా.. అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషిలు నిర్మించారు. కాగా, ఈ చిత్రం భారీ విజాయాన్ని సాధించడంతో నటుడు అనుపమ్ ఖేర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది సినీ వర్గాల విజయమని ఆయన అన్నారు. 1990 దశకంలో కాశ్మీర్‌లో హిందూ పండితులపై టెర్రిస్టుల దాడి ఎందుకు జరిగింది?, వారిని ఊచకోత ఎందుకు కోశారు?, ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు?, అనంతరం జరిగిన పరిణామాలు ఏమిటి? అనే విషయాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

The Kashmir Files Collects Record Collections in 7 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News