Monday, December 23, 2024

మత్య్స సంపద పెంచిన ఘనత కెసిఆర్ సర్కారుదే

- Advertisement -
- Advertisement -
  • చేపల కోసం నాడు గోదావరి జిల్లాకు పరుగు
  • మత్య్సకారుల సంక్షేమం కోసం సర్కారు కృషి
  • మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా: మత్య్స కారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్ని నిధులైన కేటాహించ డానికి సిద్ధం గా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం రంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాడు చేపల కోసం ఆంధ్ర ప్రదేశ్‌లో గోదావరి జిల్లా మీద ఆధారపడే వాళ్ళమని, రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుంది అని అన్నారు .

అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని చెరువుల, కుంటల్లో పూడికలు తీయించి నీటి నిల్వలను పెంచడం ద్వారా నేడు మన చెరువుల్లోనే చేపలు పుష్కలంగా లభిస్తున్నాయని మంత్రి అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో 27 వేల పై చిలుకు చెరువుల్లో, 3 ఏళ్ళలో 10 వేల కోట్లు ఖర్చు పెట్టి పూడికతీత పనులు చేపట్టి సత్పలితాలు సాధించినట్లు తెలిపారు. నాడు ఎండిన చెరువులతో, ఎండాకాలం పశువుల కోసం తొట్టిలు కడుతుండే వారని నేడు ఎండాకాలంలో కూడా చెరువులు,కుంటలు, రిజర్వాయర్లు నిండు కుండాల మారాయని అన్నారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భూగర్భ జలాలు భారీగా పెరిగి 5 మీటర్ల పైకి నీరు వచ్చిందని తెలిపారు. గంగ పుత్రులు, మృత్స కారులు, ముదిరాజ్ కులస్తుల కోసం జిల్లాలో 2016-17లో 45 చెరువుల్లో ఉచితంగా చేపలు వదిలే కార్యక్రమం చేపడితే నేడు జిల్లాలో 765 చెరువులల్లో చేప పిల్లలు రొయ్యలు వదులుతున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న సొసైటీలకు అదనంగా కొత్త సొసైటీలు స్థాపించేలా ఆదాయము వారి సభ్యులకు దక్కేలా చూస్తున్నట్లు తెలిపారు.

ఇబ్రహింపట్నం చెరువులో 4 కోట్ల ఆదాయం లభిస్తుందని నాడు ఈ చెరువులో నీటి కోసం యజ్ఞాలు చేసే వారని కృష్ణ నీటితో నింపాలని డిమాండ్ చేసే వారని, నేడు ఇబ్రహీంపట్నం చెరువుతోపాటు, రావిర్యాల చెరువు నిండి పంట పొలాల్లోకి నీరు చేరిందని అన్నారు. ప్రభుత్వం మృత్సకారులకి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తూ 75 శాతం సబ్సిడీతో 900 కోట్లతో వాహనాలు సమకూర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గణనీయంగా మత్స్య సంపద పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో ఉచితంగా చేప పిల్లల పంపిణీ జరుగుతుందని అన్నారు మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు.

రకరకాల చేపలతో లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను స్థానికులు సందర్శించి వంటకాలను ఆస్వాదించాలని అన్నారు. గతంలో 5 వేల టన్నుల మృత్స సంపద ఉత్పత్తి అయితే నేడు 9 వేల టన్నుల ఉత్పత్తి అవుతుందని అని అన్నారు. 138 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. నాలుగు సొసైటీలకు ఈ సందర్భంగా మంత్రి సర్టిఫికెట్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ అనిత హర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జిల్లా మత్స్య శాఖ అధికారి సుకృతి,అధికారులు, మృత్సకారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News