Wednesday, December 25, 2024

తమిళనాడులో ‘ది కేరళ స్టోరీ’ నిలిపివేత…

- Advertisement -
- Advertisement -

చెన్నై: ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తమిళనాడులో ప్రదర్శించరాదని థియేటర్ల యాజమానులు ఆదివారం నిర్ణయించారు. ఈ సినిమా తీవ్ర వివాదాస్పదం అయినందున, దీనిని విడుదల చేస్తే మల్టీప్లెక్స్‌ల్లోని ఇతర సినిమాలపై ప్రభావం పడుతుందని, ఎటువంటి అవాంఛనీయ ఘటన జరిగినా తమకు నష్టం వాటిల్లుతుందని, అందుకే ఈ సినిమాను థియేటర్లలో విడుదలకు ప్రదర్శనకు దిగరాదని నిర్ణయించుకున్నట్లు థియేటర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు.

అయితే శుక్రవారం విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే 13 థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. దీనిని ప్రదర్శించరాదనే నిర్ణయంతో ఇక థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శన ప్రశ్నార్థకం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News