- Advertisement -
కీవ్: ఉక్రెయిన్ దళాలు వ్యూహాత్మకంగా ముఖ్యమైన కీవ్ నగర శివారు మకరీవ్‌ను మంగళవారం హస్తగతం చేసుకున్నాయి. కాగా మారియుపోల్ దక్షిణ రేవు కోసం పోరాటం మాత్రం తీవ్రంగా కొనసాగుతోంది. పారిపోతున్న సామాన్యులు(సివిలియన్స్) మాత్రం బాంబులు ఆగకుండా పడుతున్నాయన్నారు. వీధుల్లో చనిపోయినవారి శవాలు పడి ఉన్నాయన్నారు. రష్యా దాడి మొదలెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 35 లక్షలకు పైగా జనులు ఉక్రెయిన్ వదిలి పారిపోయారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ తెలిపింది. కాగా ఖెర్సన్ నగరానికి మానవతా సాయాన్ని కూడా రష్యా అడ్డుకుంటోందని ఉక్రెయిన్ ఉపప్రధాని అన్నారు. రష్యా ఇప్పటికీ కీలక మౌలికవసతులపై బాంబు దాడులు జరుపుతోంది. నివాస ప్రాంతాలలో కూడా బాంబుల వర్షం కురిపిస్తోంది. అందుకు ఆయుధాలు, మల్టీ రాకెట్ లాంచర్లు, ఖండాంతర క్షిపణులు ఉపయోగిస్తోంది.
- Advertisement -