Wednesday, January 22, 2025

బాధితుల విల్లాపం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/పటాన్‌చెరు : సంగారెడ్డి జిల్లా, ఘన్పూర్ గ్రామ పరిధి లో బీహెచ్‌ఈఎల్ నగ్నార్ ఎంఏసీహెచ్‌ఎస్ విల్లాల కోసం డబ్బులు చెల్లించిన బాధితులు విల్లాలు నిర్మించే చోట ప్లకార్డులతో ఆదివారం ఆందోళన చేపట్టారు. విల్లాలు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఒప్పందం సమయం కంటే 8 నెలలు దాటుతున్నా విల్లాలు బుక్ చేసుకున్న వారికి ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు.

అసోసియేషన్ పేరుతో థర్డ్ పార్టీ నుంచి విల్లాలు బుక్ చేసుకున్న బాధితులు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించారని వారు తెలిపారు. 254 మంది వద్ద నుంచి దాదాపు 240 కోట్ల రూపాయల తీసుకున్నారని అన్నారు. అయితే, అర్ధంతరంగా విల్లాల నిర్మాణ పనులు నిలిపివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.25 ఎకరాల లేఔట్ చూపి 21 ఎకరాల్లోనే నిర్మిస్తూ 254 విల్లాలకు బదులు 276 విల్లాలు నిర్మిస్తూ తమకు కల్పించాల్సిన వసతులు, రావలసిన సౌకర్యాలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే విల్లాల నిర్మాణ పనులు పూర్తి చేసి తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై భానూరు బీడీఎల్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.

the victims

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News