- Advertisement -
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ శారదపీఠంకు షాకిచ్చింది. ఇదివరలో వైసిపి కేటాయించిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ. 220 కోట్లయితే, కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు కేటాయించారని పేర్కొంది. ఆంధ్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థలంపై దర్యాప్తు చేపట్టి ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతేకాక తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణం పనులపై కూడా చర్యలు తీసుకోవాలని టిటిడిని ఆదేశించింది.
- Advertisement -