Saturday, December 21, 2024

అమర త్యాగాలను తెలంగాణ గడ్డ ఏనాటికి మరువదు

- Advertisement -
- Advertisement -

మౌలాలి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు తమ ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరులను , వారి త్యాగాలను ఏనాటికి తెలంగాణ గడ్డ మరచి పోదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మౌలాలి యునాని చౌరస్తా (పీఎన్ ఆర్ సినిమాల్ కాంప్లెక్స్) వద్ద తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు, సీనియర్ నేత మహ్మద్ ఉస్మాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ అమర వీరుల స్మారక స్దూపాన్ని’ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అంతకు ముందు ఎమ్మెల్యే మౌలాలి చౌరస్తాలో గులాబీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అమర వీరులను ఆయన స్మరించుకొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి నియోకవర్గంలో తెలంగాణ ఉద్యమ కారులను శాలువలతో ఘనంగా సన్మానించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తుందని ఈ సందర్భంగా రైతు బంధు, రైతు భీమా, దళిత బంధు, బిసిలకు రూ లక్ష ఆర్ధిక సహాయం , పించన్లు పెంపు వంటివి వివరించారు. అమర వీరుల స్మారక స్థూపాన్ని నిర్మించిన ఉద్యమ కారుడు, ఈ కార్యక్రమ నిర్వాకుడు మహ్మద్ ఉస్మాన్‌ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా మహ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ ..తెలంగాణ ఉద్యమ రధ సారధి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో మలి దశ ఉద్యమంలో తాను పాల్గొని జైలు కెళ్లానని, పలు కేసులు తనపై పెట్టి వేధించారని వాపోయారు. ఆర్దికంగా ఎన్ని ఇబ్బందులు పడినా, తాను ఉద్యమంలో చురకుగ్గా పాల్గొన్నానని తెలిపారు.

తెలంగాణ సాధన కోసం అమరుల త్యాగాలను భావి తరాల వారికి తెలియజేసేందుకే మౌలాలిలో తన స్వంత డబ్బు, దాతల సహకారంతో ఈ స్మారక స్దూపం నిర్మించానని తెలిపారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేతుల మీదుగా నేడు ఆవిష్కరణ నోచుకోవడం సంతోషంగా ఉందని ఆయనకు ఉస్మాన్ కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు, సీనియర్ నేతలు బద్దం పరుశురాంరెడ్డి, మోనార్ భాగ్యానంద్‌రావు, మహ్మద్ ఉస్మాన్, ఎంజీకె నయూమ్ ఖాన్, జీఎన్‌వీ సతీష్‌కుమార్, గుండా నిరంజన్, చంద్రకాంత్, సాధిక్, ఉషశ్రీ, నోరి. సత్యమూర్తి, అమీనుద్ధీన్, ఆదినారాయణ, మేకల రాముయాదవ్, సంతోష్ రాందాస్, మోహన్‌రెడ్డి, తులసీ సురేష్, ఇబ్రహ్మీం, జోగు శ్రీనివాస్, బుద్ది నర్సింగరావు, గౌలీకర్ శైలేందర్, గౌలీకర్ దినేష్‌కుమార్, బాలస్వామి, సంతోష్‌గుప్తా,నవాబ్, షకిల్, బాలకృష్ణగుప్తా, బ్రహ్మయ్య తదదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News