Saturday, November 23, 2024

వంద పడకల ఆసుపత్రి భూమి వైద్య ఆరోగ్య శాఖకు అప్పగింత

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి  :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. పల్లె ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు పల్లెలను ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. గురువారం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును కలిసి కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని, అభివృద్ధి పనులను నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో నూతనంగా నిర్మించే వంద పడకల ఆసుపత్రికి నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని సేకరించి మంత్రి సమక్షంలో వైద్య ఆరోగ్య శాఖకు అందజేశారు. ఆమనగల్లులో నూతనంగా నిర్మించే 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రి హరీష్ రావు కోరారు. వెల్దండ మండల కేంద్రంలో ఆసుపత్రి ఆధునీకరణకు గతంలో 97 లక్షల నిధులు కేటాయించారని అదనంగా మరో 50 లక్షల రూపాయలను మంజూరు చేయాలని మంత్రి హరీష్ రావుకు విన్నవించారు.
కెఎల్‌ఐ కాలువ నిధులు విడుదల చేయాలి: కల్వకుర్తి ఎత్తి పోతల పథకంలో భాగంగా జంగారెడ్డిపల్లి నుంచి మాడుగుల నాగిళ్ల వరకు వెళ్లే డి 82 కాలువలో భూములు కోల్పోయన రైతులకు పరిహారంగా 16 కోట్ల 50 లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఆ నిధులు కలెక్టర్ ఖాతాలో ఉన్నాయని, ఆ నిధులను వెంటనే విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావును ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కోరారు. కడ్తాల్ నుంచి పడకల వరకు రోడ్డు విస్తరణలో భాగంగా డబుల్ రోడ్డు నిర్మాణంకు 20 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే బిటి రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు.
గట్టిప్పలపల్లిలో బ్యాంకు ఏర్పాటుకు కృషి : తలకొండపల్లి మండలంలోని గట్టిప్పలపల్లి గ్రామంలో నూతనంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కోరిక మేరకు క ల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని, స ంబంధిత శాఖ అధికారులకు, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అ ధి కారులకు మంత్రి ఆదేశాల జారీ చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News