Monday, December 23, 2024

గ్రంథాలయ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లా కేంద్ర గ్రంధాలయం లో నూతనంగా స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న గ్రంధాలయ భవన నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని రాష్ట్ర పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ శ్రీనివాస చారి అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ శ్రీనివాసా చారి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఉచిత భోజనం అందిస్తూ , 24 గంటలు గ్రంథాలయాన్ని నడిపిస్తున్న కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, సిబ్బందిని అభినందించారు.అదే విధంగా జిల్లా కేంద్ర గ్రంధాలయంలో నూతనంగా నిర్మించిన తాత్కాలిక కేంద్ర గ్రంధాలయ భవనాన్ని పరిశీలించి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అదే విధంగా నూతనంగా నిర్మించబోయే స్మార్ట్ సిటీ గ్రంధాలయ భవనాన్ని గురుంచి అన్ని విషయాలను అడిగి తెలుసుకుని త్వరితగతిన భవన నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్యదర్శి ఏ సరిత, గ్రంధాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News