Monday, December 23, 2024

కంటి వెలుగు అద్భుతం

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: కంటి వెలుగు అద్భుతమని ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ మండల పరిధి కోమటి బండ గ్రామంలో కంటి వెలుగును ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు కార్యక్రమం సిఎం కెసిఆర్ నాయకత్వం, మంత్రి హరీశ్‌రావు సారధ్యంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజలకు పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంగా గుర్తింపు పొందిందన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని వారి వారి రాష్ట్రాల్లో ప్రారంభం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పంగా మల్లేశం, గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, ఎంపిపి కృష్ణాగౌడ్, సర్పంచ్ తూం శేఖర్, గ్రామస్థులు , డాక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News