Thursday, December 26, 2024

ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన వేములపల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేములపల్లి ఎన్‌ఎస్పీ క్యాంపుకు చెందిన చి ట్టిమల్ల వెంకన్న అదే గ్రామంలోని పుట్టల ప్రకాష్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా మంగళవారం ట్రాక్టర్ బేరింగ్ పోవడంతో సాయంత్రం వెల్డింగ్ పెట్టించేందుకు ట్రాక్టర్‌ను తీసుకెళ్తుండగా మిర్యాలగూడ నుంచి నల్లగొండ వైపు వెళ్తున్న లారీ వేములపల్లి మండల కేంద్రంలోని మసీదు వద్దకు రాగానే టైర్ పగలడంతో ట్రాక్టర్‌ను వెనుక వైపు నుంచి వచ్చి వేగంగా ఢీ కొట్టిందన్నారు.

ఈ స ంఘటనలో ట్రాక్టర్ పల్టీ కొట్టగా డ్రైవర్ వెంకన్న రోడ్డు పై పడడంతో పక్కటెముకలకు తీవ్ర గాయాలు కాగా మిర్యాలగూడ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. అక్కడ వెంకన్నను పరీక్షించి వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం నల్లగొండకు తరలించాలని సూచించగా నల్లగొండకు తరలించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News