Monday, December 23, 2024

ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్షం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : మహిళలు సంతోషంగా ఉండటమే మా ప్రధాన లక్షంగా ఎక్కడ స్థలం అందుబాటులో ఉన్న అక్కడ నగరపాలక సం స్థ ద్వారా మహిళా సంఘ భవనాలు నిర్మిస్తున్నామని నగర మేయర్ వై సునీల్‌రావు అన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా ఆ దివారం 35వ డివిజన్‌లో పర్యటించారు.

స్థానిక కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డితో కలిసి సప్తగిరికాలనీలో నగరపాలక సంస్థకు చెందిన 30 లక్షల నిధులతో పల్లవి అక్షరదీపం సమైఖ్య సంఘ భవనానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. వేగవంతం గా భవన నిర్మాణం చేపట్టి ప్రారంభానికి సిద్ధ్దం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 35వ డివిజన్ సప్తగిరికాలనీ అనేది గతంలో శివారు ప్రాంతమని, ప్రస్తుతం సప్తగిరికాలనీని నగరం నడిమధ్యలో ఉన్న ప్రాంతంగా మారిందన్నారు. డివిజన్ వ్యాప్తంగా అన్ని కాలనీలలో సీసీ రోడ్లు, డైనేజీ నెట్‌వర్క్, ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం, ప్రతి వీదిలో వీదిదీపాలను ఏర్పాటు చేసి ప్రజలకు కావల్సిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడం జరిగిందన్నారు.

మరోవైపు స్థానిక ప్రజల ఆరోగ్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఓపెన్ జిమ్ము, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ మసూద్ ఆలీ, డివిజన్ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News