Saturday, November 16, 2024

ప్రజల ఆరోగ్య రక్షణే పాలకవర్గ ప్రధాన బాధ్యత

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ప్రజల ఆరోగ్య రక్షణే పాలకవర్గ ప్రధాన బాధ్యత అని, ఎలాంటి విపత్తులు సంభవించిన వాటిని ఎదుర్కొనేందుకు నగరపాలక సంస్థ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిద్దంగా ఉందన్నారు. హైదరాబాద్ సీడీఎంఏలో ప్రకృతి విపత్తులపై ప్రత్యేక శిక్షణ పొంది వచ్చిన నగరపాలక సంస్థ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందికి సోమవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రశంస పత్రాల డిస్టిబ్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

నగరపాలక సంస్థ కమీషనర్ సేవా ఇస్లావత్ సమక్షంలో జరిగిన కార్యక్రమాని మేయర్ వై సునీల్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ పొందిన 23 మంది సిబ్బందికి మేయర్, కార్పొరేటర్లతో కలిసి తన చేతుల మీదుగా రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేశారు. శిక్షణలో మెలుకువలు నేర్చుకున్న సిబ్బందిని మేయర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ, బీఆర్‌ఎస్ నాయకులు, ఎస్‌ఈ నాగమల్లేశ్వర్‌రావు, డీసీపీ సుభాష్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News