Wednesday, January 22, 2025

రాహుల్ గాంధీని చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

నగ్డా(ఉజ్జయిని): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని చంపేస్తానని బెదిరిస్తూ లేఖ రాసిన వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ ’భారత్ జోడో యాత్ర‘ ఇండోర్‌కు చేరుకోగానే బాంబు పేల్చి రాహుల్‌ను హతమారుస్తానంటూ హెచ్చరించిన దయా అలియాస్ ప్యారే అలియాస్ నరేంద్రసింగ్‌ను ఉజ్జయినిలోని నగ్డా ప్రాంతంలో అదుపులోకి తీసుకుని ఇండోర్ పోలీసులకు అప్పగించారు. ఆధార్ కార్డు ఆధారంగా అతడు ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీకి చెందినవాడని గుర్తించారు.

నిందితుడి కోసం పోలీసులు 200 సిసి టివి ఫుటేజీలను తనిఖీ చేశారు. అరడజను నగరాల్లోని హోటళ్లు, లాడ్జీలు, రైల్వే స్టేషన్లలో దాడులు చేశారు. నిందితుడు రాయబరేలికి చెందిన వాడని, గతంలోనూ లేఖలు, ఫోన్ల ద్వారా చాలామందిని బెదిరించాడని పోలీసులు తెలిపారు. కాగా, ఇండోర్‌లోని ఖల్సా స్టేడియంలో గతంలో జరిగిన కార్యక్రమానికి నిందితుడు హాజరయ్యాడని, ఆ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.

Threat letter

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News