Wednesday, January 22, 2025

వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : వ్యక్తి హత్యకు గురైన సంఘటన నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ప్రకారం. మండలంలోని అల్వాల్‌పాడు గ్రామానికి చెందిన బొలిగొర్ల వెంకన్న(42) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన రావుల కోటయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా అల్వాల్‌పాడుచెన్నాయిపాలెం రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేయగా, తీవ్ర గాయాలపాలయ్యారు.

బాధితుడిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందినట్లు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, నిందితులు పరారిలో ఉన్నట్లు హాలియా సిఐ. గాంధీనాయక్ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ గుండు శోభన్‌బాబు, ఏఎస్‌ఐ రామయ్యలు సిబ్బందితో కలిసి పరిశీలించి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి రావుల కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుడికి భార్య నాగమ్మ, వివాహితులైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు: అందరితో కలివిడిగా ఉండే మృతుడు వెంకన్న ఆకస్మికంగా హత్యకు గరువడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోజువారిగానే అందరితో ఉదయం గ్రామంలో కలియ తిరిగిన మృతుడు వెంకన్న తొలి ఏకాదశి సందర్భంగా తన గ్రామానికి చెందిన రావుల కోటయ్యతో కలిసి పుణ్యస్నానమాచరించడానికి సత్రశాలకు బయలుదేరగా మార్గమద్యలో హత్యకు గురవడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివాదరహితుడా మంచి పేరున్న వెంకన్న వ్యవసాయం చేసుకుంటూ తన ఇద్దరు కూతుళ్ల వివాహం చేసిన అతనికి ప్రశాంత జీవనం గడపాల్సిన సమయంలో ఈ దారుణం జరగటం బాధాకరమని గ్రామస్తులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News