రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
హైదరాబాద్: మణిపూర్‌లో ఇద్దరి గిరిజన మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించిన దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఇలాంటి దుర్ఘటనతో యావత్ భారతావణి సిగ్గుతో తలదించుకుందని శుక్రవారం ట్విట్ చేశారు. అటువంటి దుర్మార్గమైన ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మానవత్వానికే ఇదొక మాయని మచ్చగా మిగిలపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలపై జరిగిన ఘటన అమానుషం, బాధాకరమని ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మానవత్వానికి మాయని మచ్చ, యావత్ భారతదేశానికి సిగ్గుచేటు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గులను కఠినంగా శిక్షించి, ఆ మహిళలకు న్యాయం జరిగేలా వారికి అండగా ఉంటాయని ఆశిస్తున్నానట్లు తెలిపారు. గత మూడు నెలల నుంచి రెండు వర్గాలపై దాడులు జరుగుతున్న అక్కడి ప్రభుత్వం ఎందుకు అదుపుచేయలేకపోతున్నారని మండిపడ్డారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తే వారిపై ఇతర వర్గాలు అమానుష చర్యలకు పాల్పడం సరికాదని, వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి పరిస్థితులను చక్కదిద్ది ప్రశాంత వాతావరణం కల్పించాలని సూచించారు. ఈసంఘటనపై పార్లమెంటు అట్టుడికిపోవడం మరువలేని సంఘటనని ఆందోళన వ్యక్తం చేశారు.