Monday, December 23, 2024

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ తీరు సరైంది కాదు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

మనతెలంగాణ/హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ తీరు సరైందికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రాజకీయ కోణంలోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని ప్రతి ఒక్కరి అర్థమైందని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత లక్షల కోట్లు బడ్జెట్ ఆయన ప్రవేశపెట్టారని ఆమె గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పరిశ్రమలను చంద్రబాబు తీసుకొచ్చారన్నారు. 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబును అలా అరెస్ట్ చేయడం చాలా తప్పని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News