Sunday, January 19, 2025

యాదాద్రికి చేరుకున్న బిఆర్‌ఎస్ నేతల పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

యాదాద్రి : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలని కోరుతూ జనగామ నుంచి ప్రారంభించిన పాదయాత్ర యాదగిరిగుట్టకు చేరుకుంది. బుధవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండకింద వైకుంఠ ద్వారం దగ్గర కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న 30 మంది సభ్యుల బృందం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి జనగామలో ఎమ్మెల్యేగా గెలవాలని, లక్షకుపైగా మెజార్టీ సాధి ంచాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జనగాం మున్సిపల్ కౌన్సిలర్లు కర్రె శ్రీనివాస్, సుల్తాన్‌రాజ్‌తో పాటు బిఆర్‌ఎస్ నాయకులు మిద్దెపాక లెనిన్, మల్లిగారి రాజు, మామిడాల రాజు, విజయ్, రామకృష్ణ, సురేష్, సందీప్, ఎమ్.కుమార్ తదితరల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News