Monday, December 23, 2024

గిరిజన విద్యా సంస్థల మెనూ టెండర్ ఖరారు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్: మన్ననూర్ ఐటిడిఏ పరిధిలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట ఐదు జిల్లాలో కొనసాగుతున్న 18 ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు నూతన విద్యా సంవత్సరవంలో మెనూకు అవసరమైన ఆహార పదార్థాల సరఫరాకు టెండర్లు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తెలిపారు.

శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, గిరిజన సంక్షేమ శాఖ ఆర్‌సిఓ, ఎటిడబ్లూఓలు, గురుకుల ప్రిన్సిపల్స్, హాస్టల్స్ వెల్ఫేర్ అధికారులు, టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. మెనూ అమలులో గాని, ఆహార పదార్థాల సరఫరాలోగాని తేడాలోస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన్ననూర్ ఐటిడిఏ పరిధిలోని గురుకుల బాలికల, బాలుర కళాశాలలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వెల్దండ మండలంలో నిర్వహిస్తున్న ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్‌లో మెనూ అమలుకు సంబంధించి 18 గురుకుల పాఠశాలల వారిగా టెండర్లను ఆహ్వానించగా గురుకులాల వారీగా దాఖలు అయ్యాయన్నారు.

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు టెండర్లు ఖరారైన సంబంధిత కాంట్రాక్టర్లు నిబంధన మేరకు నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని ఆదేశించారు. దీనిపై సంబంధిత పాఠశాలల బాధ్యులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, గిరిజన సంక్షేమ శాఖ గురుకులాల ఆర్సిఓ నాగార్జున, గిరిజన సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News