Wednesday, January 22, 2025

మిల్లింగ్ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : రబీలో సేకరించిన ధాన్యం మిల్లింగ్ వేగవంతంగా చేసి ఏజెన్సీలకు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక రైసు మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో రైసు మిల్లర్లు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రబీలో సేకరించిన ధాన్యం నిల్వలు ఏమాత్రం ఉందని, మిల్లింగ్ పూర్తి అయిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ మిల్లింగ్ శాతం ఉన్న మిల్లులు 24 గంటల పాటు మిల్లులను నడిపించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.

ప్రతి రోజు అధికారులు మిల్లులను తనిఖీలు చేయాలని, స్పైడ్ షీట్లలో మిల్లింగ్ నమోదు చేయాలని కేపాసిటీ మేరకు మిల్లింగ్ జరుగుతుందా లేదా అనేది పరిశీలించాలని ఆదేశించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వంద శాతం మిల్లింగ్ పూర్తి చేసి సరుకును రవాణా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, మేనేజర్ కృష్ణవేణి, వివిధ మండలాల తహసీల్దార్లు, ఫీల్డు ఆఫీసర్లు, రైసు మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News