ఎక్స్‌లో బిఆర్‌ఎస్ నేత హరీశ్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కీలక ఘట్టం మిలియన్ మార్చ్ అని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్ రావు పేర్కొన్నారు.ఈ మేరకు హరీశ్‌రావు ఎక్స్ వేదికగా అప్పటి పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన ప్రజా విప్లవమని వ్యాఖ్యానించారు.
నిర్బంధాలు.. అరెస్టులు.. దిగ్బంధాలను ఎదుర్కొంటూ జల మార్గం గుండా పడవలో వచ్చి మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న సందర్భం నేటికి 13 ఏండ్లయినా ఇంకా కళ్ళముందు కదలాడుతూనే ఉందంటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఆ నాడు తెలంగాణ ప్రజలు చూపిన తెగువకు, పోరాటానికి, ఉద్యమ స్ఫూర్తికి వందనం…జై తెలంగాణ…అమరవీరులకు జోహార్ అంటూ హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మిలియన్ మార్చ్ కీలక ఘట్టం. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన ప్రజా విప్లవం.
నిర్బందాలు..అరెస్ట్ లు..దిగ్బందాలను ఎదుర్కొంటూ జల మార్గం గుండా పడవలో వచ్చి మిలియన్ మార్చ్ లో పాల్గొన్న సందర్భం నేటికీ… pic.twitter.com/7yeeJ70xfd
— Harish Rao Thanneeru (@BRSHarish) March 10, 2024