Wednesday, January 22, 2025

విద్యార్థులకు అవార్డులు అందజేసిన మంత్రి

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణ పరిధిలోని హొతి కే విద్యార్థులు నేపాల్‌లో అంతర్జాతీయ ఖోఖో ఆటలలో అవార్డు సాదించారు. ఈ ఆవార్డును మంత్రి హరీష్‌రావు నివాసంలో వారి చేతుల మీదుగా విద్యా ర్థులు అందుకున్నారు. గతంలో శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో పాల్గొనడానికి వెళ్లే క్రమంలో ప్రయాణానికి ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మొగుడంపల్లి మండల జడ్పీటీసీ అరుణమోహన్‌రెడ్డి తెలుసుకుని విద్యార్థులు ప్రయాణ చార్జీలు లేక వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులను జడ్పీటీసీ మోహన్‌రెడ్డి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావుతో వివరించగా స్పందించిన మంత్రి విద్యార్థులకు శ్రీలంక దేశానికి వెళ్లేందుకు చర్యలను తీసుకోవాలని ఆదేశించడంతో కలెక్టర్ విద్యార్థులకు ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందించి శ్రీలంక దేశంలో జరిగిన పోటీల్లో పాల్గొనడానికి సహకరించారు. గతంలో ఇప్పుడు జరిగిన పోటీల్లో విద్యార్థులు విజయం సాదించడంపై జడ్పీటీసీ అభినందించారు. ఈ కార్యక్రమంలో కిషన్ కుమార్, తాజా మాజీ కౌన్సిలర్ నామ కిరణ్‌గుప్త, మాజీ పట్టణ అద్యక్షుడు యాకూబ్, పాఠశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News