కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ లో పని చేసే ప్రతి పారిశుధ్య కార్మికుడి రక్షణే ధ్యేయంగా పని చేస్తున్నామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. నగరంలోని మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద 15 మంది పారిశుధ్య కార్మికులకు సానిటేషన్ కిట్లు పంపిణీ చేశారు.
విధుల నిర్వహణలో కార్మికులు రక్షణ కోసం పంపిణీ చేసిన వస్తువులను తప్పక వాడాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కార్మికుడికి రెండు జతలతో కూడిన షూలు, ఒకటి (గమ్ బూట్లు, నార్మల్ బాట కంపనీ బూట్లు) స్నానం చేసేందుకు సంతూర్ సోపులు, బట్టల సోపులు, కొబ్బరి నూనె, విధుల సమయంలో వాడేందుకు గ్లౌజులు, దుమ్ము దూలికి అనా రోగ్యం పాలు కాకుండా మాస్కులు, రాత్రి సమయాల్లో పని చేస్తారు కాబట్టి ప్రమాదాలు జరుగకుండ వారిని గుర్తించేందుకు రేడి యం ఆఫ్రాన్ లు ఇతర 12 రకాల వస్తువులతో కూడిన కిట్లను అందించారు.
ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ నగరపాలక సంస్థ కు ప్రాణాధారం మా పారిశుధ్య కార్మికులన్నారు. అలాంటి కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకోవడం మా బాధ్యత కాబట్టి అదే విధంగా వారి రక్షణ కోసం తీస్కోవాల్సిన చర్యలు అన్ని తప్పకుండ తీస్కోవడం జరుగు తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక పారిశుధ్య కార్మికులకు రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వాల పాలనలో కార్మికులతో చేయించుకున్నారు తప్పా వారి రక్షణ గాని స్థితిగతులను ఏ ప్రభుత్వం చూడ లేదన్నారు. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు వారి వేతనాలు 6 వేలకే పరితమయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేతానలను రూ. 16 వేలకు పెంచడం జరిగిందన్నారు.
ప్రతి నెల వారి ఖాతలో జమ చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ఇచ్చే 6 వేల వేతనాలను కూడా 6 నెలలకు ఒక సారి చెల్లించే వారన్నారు. పారిశుధ్యం మెరుగు పరచడం లోనే దేశ స్థాయిలో నగరపాలక సంస్థ కు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. సఫాయి మిత్ర సురక్ష చాలేంజ్ లో 4 కోట్ల రూపాయల నగదు బహుమతి రావడం కార్మికుల శ్రమ ఫలితమే అన్నారు. తప్పకుండ రాబోయే రోజుల్లో కూడ కార్మికుల పక్షణ నిలబడుతా మన్నారు.
గతంలో ఎన్నడు లేని విధంగా పారిశుధ్యంలో పని చేసి దిగిపోయిన, ఎవరైనా చనిపోయినా వారి కుటుంబంలోనే ఒక రికి ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక జీవోను తేవడం జరిగిందని తెలిపా రు. వారి కుటుంబాలు రోడ్డున పడకుండ జీవో తెచ్చిన మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్మికులను కడుపుల పెట్టుకొని కాపాడుకోవడమే మా ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, డిప్యూటీ కమీషనర్ త్రియంభకేశ్వర్, సానిటేషన్ సూపర్ వైజర్ రాజమనోహార్, తదితరులు పాల్గొన్నారు.