Wednesday, January 22, 2025

నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయం

- Advertisement -
- Advertisement -

గోషామహల్: గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్షంగా ముందుకు సాగుతున్నట్లు ఇండియ న్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బిఎన్ రావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 2004లోనే ఆవో గావ్ చలే కార్యక్రమానికి శ్రీ కారం చుట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివానం కోఠిలోని ఐఎంఏ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేరరుల సమావేశంలో ఆయన అసోసియేషన్ ప్రతి నిధులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ శాఖ పిలుపు మేరకు ఆదివారం తె లంగాణ వ్యాప్తంగా గల 55 శాఖల్లో దాదాపు 20వేల మంది వైద్యులు పాల్గొని 200 గ్రామాలను దత్తత తీసుకుని ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభిం చినట్లు తెలిపారు. పల్లెకు పోదాం కార్యక్రమం నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, ఇది ఒకరోజుతో ముగిసే కార్యక్రమం కాదన్నారు.

ఈ వైద్య శిబిరా ల్లో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, డెర్మటాలజీ, ఆర్థోఫెడిక్ విభాగాల వైద్యులు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తారని తెలిపారు. పేద లకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్షంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భుజాన వేసుకుని అందని ద్రాక్షగా మారిన వైద్యాన్ని పేదల చెంత కు అందించాలన్న ఉద్దేశ్యంలో ఆవో గావ్ ఛలే కార్యక్రమాన్ని తిరిగి పునరుద్దరించినట్లు వెల్లడించారు, గ్రామీణ ప్రాంతాల్లో తమకు డయాబెటీస్ సోకింద ని కూడా తెలియని వారి కోసం ప్రత్యేక పరీక్షలతో పాటు స్క్రీనింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ జీవ నాన్ని ఆరో గ్యంగా కొనసాగించాలన్న మహోన్నత లక్షంతో గ్రామీణ ప్రాంతాల దత్తత కార్యక్రమానికి అంకురార్ఫణ చేసినట్లు చెప్పారు.

ఐపిఎం ప బ్లిర్ అండ్ కమ్యూనిటీ సర్వీస్ కమిటీ ఛైర్మెన్ డాక్టర్ బి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారిందన్నారు . గ్రామీణ ప్రాంతాలు, మురికివాడల ప్రజలు ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కోసం తమ ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆ వేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజల చెంతకే వైద్యసేవలను తీసుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో పల్లెకె పోదాం కార్యక్రమాన్ని పున: ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఐఎంఏ రాష్ర్ట కార్యదర్శి జె విజయ్‌రావు, కో శాధికారి డాక్టర్ రాజేందర్ కుమార్, యాదవ్, మాజీ అధ్యక్షులు డాక్టర్ ఎం సంపత్‌రావు, డాక్టర్ పుత్తా సురేస్, డాక్టర్ భవాని, డాక్టర్ కిషన్, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ జి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News