Thursday, January 23, 2025

పేద ప్రజలకు వైద్యం అందించడమే ధ్యేయం

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: ఐఎంఏ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని వంగపహాడ్ గ్రామంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును వంగపహాడ్ గ్రామస్థుడు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ దేవుళ్లపల్లి ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఎంఏ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశామన్నారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించడమే లక్షంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య తెలంగాణ లక్షంగా ఐఎంఏ తెలంగాణ విభాగం విభాగం పనిచేస్తుందన్నారు. 20 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరిగిందన్నారు.

ప్రజలకు అవసరమైన మందులు, పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ప్రవీణ్‌కుమార్ వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సమాజ సేవలో ఐఎంఏ ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున గ్రామస్థులు హాజరైనట్లు తెలిపారు. ఈ శిబిరంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ వద్దిరాజు, సెక్రటరీ డాక్టర్ సనత్‌కుమార్, కోశాధికారి డాక్టర్ అజిత్ మహ్మద్, ఎంజీఎం సూపరింటెండెంటు డాక్టర్ చంద్రశేఖర్, జిల్లాలోని ప్రముఖ వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News