Monday, December 23, 2024

నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయం

- Advertisement -
- Advertisement -

బెజ్జూరు: మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్షమని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నా రు. బెజ్జూరు మండలంలోని కుంటలమానేపల్లి, కుకుడ, హుట్‌సారంగపల్లి, బెజ్జూరు గ్రామాలలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శుక్రవా రం పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల ప్రజలు భజభజంత్రిలతో ఘన స్వా గతం పలికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.

ప్రజల ఆరోగ్యం దృష్టా మారుమూల ప్రాంతాలలో ప్రజలకు వైద్యం అం దించేందుకు వీలుగా హెల్త్ సెంటర్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజల ఆరోగ్యం కోరే ప్రభుత్వం అని అన్నారు. కుకు డ, బెజ్జూరులో హెల్త్ సెంటర్‌ల ఏర్పాటు కోసం భూమిపూజ నిర్వహించారు. అనంతరం బెజ్జూరు మండల కేంద్రంలో అంబేద్కర్ కమిటీ హాల్ నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించారు. అంబేద్కర్ నూతన కమిటి భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు మం జూరు అయినట్లు వారు తెలిపారు.

అనంతరం సలుగుపల్లి గ్రామంలో బిఅర్‌ఎస్ పార్టీలో చేరడంతో వారికి ఎమ్మెల్యే కోనప్ప పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డకే రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసిఅర్‌దేనని అన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు తునికాకు రాయితీ డబ్బులు రాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో వారు సానుకూలంగా స్పందించి తునికాకు రాయితీ డబ్బులు రాని కూలీలు తమ పేర్లను తయారు చేసి సర్పంచ్ లకు కాని, ఎంపిటిసిలకు కాని ఇచ్చినట్లయితే అట్టి జాబితాను తాను పంపిస్తే తునికాకు రాయితీ రాని వారి డబ్బులను వారి ఖా తాలలో జమ చేసేలా చూస్తామని తెలిపారు.

నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్షమని అన్నారు. కొంతమంది గిరిజన పోడు రైతులకు పట్టాలు రాలేదని తెలుపడంతో వారికి జాబితాను కూడా తయారు చేసి పంపించినట్లయితే పట్టాలు రాని గిరిజన పోడు రైతులందరికి పట్టాలు అందించేలా కృషి చేస్తానని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పంద్రం పుష్పలత బిక్షమయ్య, రైతుబంధు సమితి జిల్లా అద్యక్షులు కొండ్ర జగ్గాగౌడ్, బిఆర్‌ఎస్ పార్టీ మండల అద్యక్షులు సిడాం సకారాం, సహాకార సంఘం చైర్మన్ కుర్సింగ ఓంప్రకాష్, సర్పంచ్‌లు భూజాడి శేఖర్, సంతోష్, రవి, హన్మంతు, యూత్ మండల అద్యక్షులు న రేందర్‌గౌడ్, కోఅప్షన్ సభ్యులు బషరత్‌ఖాన్, నాయకులు డోకే వెంకన్న, కోండపల్లి సర్పంచ్ ఉపాసి సంజీవ్, తోటమాలి కుల సం ఘం జిల్లా ఉపాద్యక్షులు కోట్రంగి రామకృష్ణ, జావిద్‌అలీ, ఇస్తారి, ఎంపిటిసిలు లంగారి శ్రీనివాస్, నాయకులు తంగడిపల్లి మ హేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News