Monday, December 23, 2024

అన్ని వర్గాల అభ్యున్నతే బిఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిశలు పాటుపడుతున్నారని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. ఏ వర్గాన్ని విస్మరించకుండా అందరికీ అన్ని విధాలుగా వ్యక్తిగతంలో లబ్ధ్ది చేకూరేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకం వర్తించని వారు లేరంటే అతిశయోక్తి కాదన్నారు. అన్ని విధాలుగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తోడ్పాడుతున్న సిఎం కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. అన్ని విధాలుగా గ్రామాలు, మారుమూల గిరిజన తండాల అభివృద్ధ్ది కూడా గతంలో కంటే భిన్నంగా మారిందన్నారు.

ఇప్పటికీ ఇంకా లబ్ధి చేకూరని వారు ఉంటే కూడా వారికి కూడా త్వరలోనే లబ్ధి చేకూరుస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మా ర్నేని వెంకన్న, ఎండి ఫరీద్, గద్దె రవి, డైలాగర్ శంకర్, లునావత్ అశోక్, ప్రియాంక, మల్లం వంశీ, ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బిఆర్‌ఎస్ నాయకులు, తహసిల్దార్ ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News