Monday, December 23, 2024

రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి ఎమ్మెల్యేకు లేదు

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రెస్‌మీట్‌లో రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. గురువారం అచ్చంపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌పై రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన సమయంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

అదే విధంగా కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి నేటికి కనిపిస్తుందని వంశీకృష్ణ ఆరోపించారు. గహలక్ష్మి పథకంలో అర్హులైన అభ్యర్థులకు మూడు రోజుల వ్యవధి ఇవ్వడం సరైంది కాదని ఆయన విమర్శించారు. బార్ షాపులకు అప్లై చేసుకునే వారికి 15 రోజుల వ్యవధి ఇవ్వడానికి వస్తది కానీ పేద ప్రజలకు అప్లై చేసుకోవడానికి మూడు రోజుల వ్యవధి ఇవ్వడం ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని, బిసి బంధు, ముస్లిం బందు రకరకాల బందులతో ఎన్నికల్లో లబ్ధి పొందడమే తప్ప మరొకటి కాదని వంశీకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వై.శ్రీనివాసులు, లాయర్ రాజేందర్, పట్టణ అధ్యక్షుడు రఘురాం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News