Wednesday, January 22, 2025

బాధుతుడికి ఎల్‌ఓసి అందజేసిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

పాపన్నపేట: అపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సిఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. పాపన్నపేట మండలం గాంధారిపల్లి గ్రామానికి చెందిన యం. శ్రీనివాస్ తండ్రి శివయ్యకు వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌కు సిఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.3 లక్షల విలువైన ఎల్‌ఓసిని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మంజూరు చేయించారు.ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీనివాస్‌కు ఎల్‌ఓసి అనుమతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఎల్‌ఓసిని మంజూరు చేయించిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, నాయకులు సాయిరెడ్డి,రాగి అశోక్, మధుసూదన్‌రావు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News