Tuesday, December 24, 2024

బాక్స్ డ్రైన్ పనులు వేగవంతం చేయాలని గుత్తేదారుపై ఎమ్మెల్యే ఆగ్రహాం

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : బాక్స్ డ్రైన్ పనులు వేగవంతం చేయాలని గు త్తేదారుపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. మన్సూరాబాద్ డివిజన్ సరస్వతీనగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న బాక్స్‌డ్రైన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే వర్షాకాలం గుర్తు పెట్టుకొని పనులు వేగవంతం చేయాలని ,పెద్ద చెరువు ప్రక్కనే ఉన్న బీరప్ప గుడి వచ్చే వరదనీరు సరస్వతీనగర్ ,శ్రీసరస్వతీనగర్ కాలనీ నుంచి శివాలయం మీదుగా మన్సూరాబాద్ నుంచి నాగోల్ మూసీలోకి చేరడం జరుగుతుందన్నారు.

పనులు సకాలంలో పూర్తయితై కాలనీ వాసులకు వరద నీటి ముంపు నుంచి పూర్తి స్థాయిలో విముక్తి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోప్పుల విఠల్‌రెడ్డి ,డివిజన్ అధ్యక్షులు జక్కడి మల్లారెడ్డి ,మాజీ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు ,జగదీష్ యాదవ్ ,రఘువీర్‌రెడ్డి ,బాలరాజ్ గౌడ్ ,కాలనీ వాసులు పాండు గౌడ్ ,వేమారెడ్డి ,వెంకన్న ,రామాచారి ,జంగయ్య గౌడ్ ,శంకర చారి ,సత్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News