Sunday, January 19, 2025

శ్రీకాంతాచారి మరణంతోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది

- Advertisement -
- Advertisement -

దేవరుప్పుల : తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన కాసోజు శ్రీకాంతచారి వీరమరణంలోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం తెలంగణ అమరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని గొల్లపల్లి గ్రామంలో కాసోజు శ్రీకాంతచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

శ్రీకాంతచారీ కటుంబ సభ్యులను సత్కరించారు. నాయనమ్మ గోవిందమ్మకు పాదాలకు నమస్కరించారు. అనంతరం మండల పరిషత్ కార్యాయం వద్ద నిర్మించిన అమరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించి తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో ప్రాణ త్యాగాలను చేసిన అమరులను స్మరించుకొని అవేదన వ్యక్తం చేశారు. తొలిదశ ఉద్యమంలో 369 మంది విద్యార్థులను చంపింది, కాంగ్రెస్ పార్టీనే అని, మలి దశ ఉద్యమంలో 1500 మంది అత్మబలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే అని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ తాము తెలంగాణ ఇచ్చామని అనడం విడ్డురంగా ఉందని, స్వాతంత్య్రం తెచ్చింది గాందీజీ అయితే కాంగ్రెస్ తెచ్చిందని చెప్పుకుంటుదని, తెలంగాణ తెచ్చింది కెసిఆర్ కాదా అని, తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్నప్పుడు… స్వాతంత్య్రం ఇచ్చింది బ్రిటీష్ వారని చెప్పాలని తెలిపారు.

తాము తెలుగుదేశంలో పార్టీలో ఉంటూనే ముప్పై మంది ఎమ్మెలను ఏకతాటి మీదకు తెచ్చి చంద్రబాబుతో గొడవపడి తెలంగాణకు మద్దతుగా లెటర్ ఇచ్చామని అన్నారు. కానీ తెలుగుదేశంలో పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు జైఆంద్రా అంటూ చంద్రబాబు మెప్పు కోసం ప్రయత్నించారని అందులో రెవంత్‌రెడ్డి ఒకరని మండిపడ్డారు. నాడు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ దీక్షచేపట్టడంతో తెలంగాణ సిద్దించిందని అన్నారు.. నాటి అసెంబ్లీలో నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ పట్ల చులకనగ మాట్డారని, తెలంగాణ వస్తే తాగు, సాగు నీరు కొరత ఉంటుందని, కరెంటు కొరత వచ్చి కరెంటు తీగలపై బట్టలు అరవేసుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. కానీ నేడు కేసిఆర్ సారథ్యంలో 24గంటల నిరంతర ఉచిత విద్యుత్‌తో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాదించామన్నారు.

ఆంద్రాలో నేడు కరెంటు లేక తీగలపై బట్టలు అరవేసుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దెవా చేశారు. అమరుల త్యాగాలను కేసిఆర్ వృథా కాకుంగా అభివృద్ధ్ది చేస్తున్నారు. నేడు ఆంధ్రా కంటే తెలంగాణలో భూముల రేట్లు అధికంగా ఉన్నాయని, ఇటివల చంద్రాబాబు నాయుడు సైతం ఒప్పుకున్నారన్నారు. శ్రీకాంతాచారీ పేరన మండలకేంద్రంలో ఆడిటోరియం కడతామని హామీ ఇచ్చారు. పోరాటాల పురటి గడ్డలో జన్మించిన శ్రీకాంతాచారి రుణం తీర్చుకుందామని అన్నారు. శ్రీకాంతచారీ నానమ్మ పాదాలకు నమస్కరించి అవేదనకు లోనయ్యారు. మరో రెండు రోజుల్లో శ్రీకాంతాచారి కుటుంబానికి సిఎం కేసిఆర్ తగిన గౌరవం అందించనన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేశం, జెడ్పిటిసి పల్లా భార్గవి సుందర్‌రాంరెడ్డి, పలు గ్రామాల ప్రజాప్రతినిదులు బిళ్‌ల అంజమ్మ యాదవరెడ్డి, రమాదేవి, నర్సింహారెడ్డి, రెడ్డిరాజులు రమేష్, కుతాటి నర్సింహులు, జలందర్‌రెడ్డి, మల్లారెడ్డి, కోక్యానాయక్, గేమానాయక్, చింత రవి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News