Monday, December 23, 2024

‘లవ్ యూ రామ్’ చిత్రానికి విశేష ఆధరణ

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మంకు చెందిన యువ నిర్మాత డి.వై. చౌదరి తన స్వీయ దర్శకత్వంలో నూతన నటీనటులతో రూపొందిచిన ’ లవ్ యూ రామ్’ చిత్రం గత నెల 30న విడుదలైన సంగతి తెలిసిందే. విజయవంతంగా రెండవ వారం ఈ చిత్రం ప్రదర్శింపబడుతున్న సందర్బంగా ఆ చిత్ర దర్శక నిర్మాత డి. వై. చౌదరి ఖమ్మం జిల్లా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మన ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇన్ అసోసియేషన్ విత్ శ్రీచక్రా ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ దర్శకులు కొండపల్లి దశరద్ కూడా ఒక నిర్మాతగా వ్యహరించినట్లు చెప్పారు.

ఈ చిత్రానికి దశరద్ చక్కటి కథను సమకూర్చారని చెప్పారు. రోహిత్ బెహాల్ హీరోగా, అపర్ణా జనార్దన్ హీరోయిన్‌గా, సీనియర్ నటులు బెనర్జీ, ప్రదీప్, కాదంబరీ కిరణ్, వకీల్‌సాబ్ ఫేం మీర్, కార్టూనిస్ట్ మల్లిక్, ప్రభావతి వర్మ, శాంతి తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు- సుధాకర్ బొర్రా, డి. నాగేశ్వరరావు, కెమెరా-సాయిసంతోష్, సంగీతం-కె వేద, స్క్రీన్ ప్లే- కిషోర్ గోపు,శివ మొక్కా, సంభాషణలు-ప్రవీణ్‌వర్మ, ఆర్ట్-గురు మురళీకృష్ణ, కొరియోగ్రాఫీ- విశాల్, లిరిక్స్-వరికొప్పుల యాదగిరి, కాస్టూమ్స్ డిజైన్ -బాబీ అంగారా తదితరులు తమ చిత్రానికి సాంకేతికంగా సహకారం అందించారని చెప్పారు. ఖమ్మం నగరంలో ఈ చిత్రం ఆదిత్య థియేటర్‌లో ప్రదర్శింపబడుతుందని చెప్పారు. ఈ చిత్రంలో ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు నటించారని అన్నారు. అన్ని వర్గాల వారు ఈ చిత్రాన్ని ఆదరించటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News