Saturday, January 4, 2025

ఓటిటిలోనూ విజయవంతంగా దూసుకెళుతున్న ‘లక్కీ భాస్కర్’ సినిమా!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు దుల్కర్ సల్మాన్(మమ్ముటి తనయుడు), నటి మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఓటిటిలోనూ దూసుకెళుతోంది. దీపావళికి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకాదరణ చురగొన్నది. రూ. 100 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఓటిటిలో కూడా ఆదరణ పొందుతోంది. విశేషమేమిటంటే దాదాపు 15కు పైగా దేశాల్లో టాప్ ట్రెండింగ్ లో చోటు దక్కించుకుంది. ఇంటిల్లిపాది అందరూ చూడదగ్గ సినిమా…అన్ని విధాల రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ‘నెట్ ఫ్లిక్స్’ లో లభ్యం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News