Thursday, January 23, 2025

నానక్‌రామ్ గూడ ఘటనను సూమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో మహిళ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. మహిళను అత్యాచారం చేసి బండరాయితో కొట్టి చంపిన ఘటన చాలా బాధాకరమని కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిందని కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించినట్లు తెలిపారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి ఘటనపై మహిళా కమిషన్ కు నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News