Thursday, January 23, 2025

కెసిఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటుంది

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే క్రాంతికిరణ్

జోగిపేట: సిఎం కెసిఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటుందని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం అందోల్ మండలంలోని నేరెడిగుంట గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ సంఘం సభ్యుడు కాంగ్రెస్ నుంచి బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ కెసిఆర్‌కు మద్దతుగా నిలుస్తున్నారనటానికి పార్టీలో చేరికలే నిదర్శనమన్నారు. ఇంత వరకు గెలిచిన ఏ నాయకులు ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు.

అందోల్‌లో మళ్లీ బిఆర్‌ఎస్ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్న తీరు బాగుందన్నారు. ఇతర పార్టీలలో దొరుకని మర్యాద బిఆర్‌ఎస్ పార్టీలో దొరుకుతుందని నాయి బ్రాహ్మణులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి క్రిష్ణాగౌడ్, గ్రామ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నాయకులు పత్తి వీరేశం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News