Monday, December 23, 2024

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఆదేశాలు బేఖాతర్

- Advertisement -
- Advertisement -

టేకుమట్ల : మానేరు ఇసుక రవాణా విషయంలో ఎన్‌జిటి ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని టేకుమట్ల మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద కాంగ్రెస్‌లతో కలిసి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ గండ్ర సత్తన్న రాస్తారోకో నిర్వహించారు.ఈ రాస్తారోకో మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సత్తన్న మాట్లాడుతూ మానేరు వాగుపై ఉన్న ఇసుక రీచ్‌లను వెంటను ఆపివేయాలని ఎన్‌జిటి , సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన, ఇసుక రవాణా ఆగడం లేదని స్థానిక నాయకుల ఆండ దండలతో ఇసుక రవాణా జరుగుతుందని, జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

నిత్యం వందలాది లారీల్లో ఇసుక తరలిపోతుందని,భూపాలపల్లి జిల్లాలో సిల్టేషన్ పేరుతో నడుస్తున్న అక్రమ ఇసుక క్వారీలను రద్దు చేయవల్సిందిగా ఎన్‌జిటి మధ్యంతర ఉత్తర్వుల ద్వారా కలెక్టర్‌ను ఆదేశించిన్పటికి అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు.ఇసుక రవాణా వేంటనే నిలిపివేయాలని, ప్రకృతి సహజవనరులను కాపాడాలని లేని యెడల మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే రిలే దీక్షలలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గ్గొంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వైనాల రవిందర్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్,మండల నాయకులు మాదం కోంరయ్య,దాసారపు సదానందం,పోన్నం సాంబయ్య,గోనెపల్లి సంపత్,శాస్త్రాల కిరణ్,తోడెటి కుమార్,మంద నరేందర్,రాజయ్య,అచ్చ స్వామి,అల్లం ఓదెలు,పంజాల రవి, శ్రీనివాసరావు,రెడ్డి రాజుల రాజు,మచ్చ ప్రభాకర్,నూనెటి రమేష్,వేముల మనోహర్,నానవేన రాజు,పండగ అనిల్,అల్లం సతీష్,ఉడుత రమేష్,పండగ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News