అమరావతి: పిఠాపురంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, వంగా గీతపై ఆధిక్యతతో కొనసాగుతున్నారు. 21 నియోజకవర్గాల్లో జనసేన 18 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది.
వైఎస్ఆర్ సిపి మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, రోజా, పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంబటి రామ్ బాబు, దాడిశెట్టి రామలింగేశ్వర రావు, కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్ధానాల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఎన్డిఏ కూటమి మిత్రపక్షాలు ముందంజలో ఉన్నాయి. చిలకలూరిపేటలో టిడిపి ఏజెంట్ రమేశ్ కు గుంటెపోటు రాగా ఆసుపత్రికి తరలించారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. పిఠాపురంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, వంగా గీతపై ఆధిక్యతతో కొనసాగుతున్నారు. నగరిలో రోజు వెనుకంజలో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేశ్ దూసుకెళుతున్నాడు. కడపలో వైఎస్ షర్మిలా వెనుకంజలో ఉన్నారు.