Thursday, January 9, 2025

నూతన పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తుంది (వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనం ప్రతిభారతీయుడు గర్వపడేలా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అంటూ కొత్తగా నిర్మించిన భవనానికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ట్విట్టర్‌లో వీడియోను ఉంచిన ప్రధాని ‘ మై పార్లమెంట్ మై ప్రైడ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి తమ వాయిస్ ఓవర్‌తో ఈ వీడియోను తనతో పంచుకోవాలని ప్రజలను కోరారు.

‘ ఈ కొత్త పార్లమెంటు భవనం ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తుంది, ఈ వీడియో ఈ ఐకానిక్ భవనం దృశ్యాలను కళ్లకు కడుతుంది. ఈ వీడియోను మీ వాయిస్ ఓవర్‌తో పంచుకోండనేది నా ప్రత్యేక అభ్యర్థన. అది మీ ఆలోచనలను తెలియజేస్తుంది. వాటిలో కొన్నిటిని నేను రీ ట్వీట్ చేస్తాను. ‘ మై పార్లమెంట్ మై ప్రైడ్ ’ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించడం మరిచిపోకండి’ అని ప్రధాని తన ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News