Sunday, December 22, 2024

కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు నూతన అధ్యక్షులు కృషి చేయాలి

- Advertisement -
- Advertisement -
  • ఏడు మండలాల అధ్యక్షులకు నియామకపత్రాలు అందజేసిన డిసిసి అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి

పరిగి: పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు మండల పార్టీ నూతన అధ్యక్షులు కృషి చేయాలని డిసిసి అధ్యక్షులు టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆదేశానుసారం వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే టిఆర్‌ఆర్ నివాసంలో ఆదివారం పరిగి నియోజకవర్గంలోని పూడూరు, పరిగి, దోమ, కులకచర్ల, చౌడాపూర్, గండ్వీడ్, మహ్మదాబాద్ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌లకు పదవీ బాధ్యతల నూతన నియామకపత్రాలను కొడంగల్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డితో కలిసి అందించారు.

పరిగి మండల పార్టీ అధ్యక్షునిగా భూమన్నగారి పరుశురాంరెడ్డి, పట్టణ అధ్యక్షునిగా ఎర్రగడ్డపల్లి కృష్ణ, పూడూరు మండల అధ్యక్షునిగా ఎస్.సురేందర్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉదన్‌రావు భాస్కర్, దోమ పార్టీ అధ్యక్షునిగా విజయ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దొరశెట్టి శాంతకుమార్, కులకచర్ల మండల పార్టీ అధ్యక్షునిగా ఆంజనేయులు ముదిరాజ్, చౌడాపూర్ అధ్యక్షులు ఎల్పటి అశోక్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వెంకటయ్యగౌడ్, గండ్వీడ్ మండల అధ్యక్షులుగా పి.నర్సింహ్మారావు, మహ్మదా బాద్ మండల పార్టీ అధ్యక్షునిగా కేఎం నారాయణలను ఎన్నుకుని నియామకపత్రాలను అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పని చేస్తున్న మండలాల పార్టీ అధ్యక్షులకు రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నిక చేసి పలువురి సీనియర్ పార్టీ నాయకుల సమక్షంలో నూతన నియమక పత్రాలను అందించామని తెలిపారు. రానున్న ఎన్నికలలో గ్రామ స్థాయిలో పని చేసి పార్టీ బలోపేతానికి బూత్ స్థాయిలో పని చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు సిద్దాంతి పార్థ సారతి, భరత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.లాల్‌కృష్ణ, డిసిసి ప్రధాన కార్యదర్శి కె.హన్మంత్ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి జగన్, జిల్లా ఉపాధ్యాక్షులు జి.రామకృష్ణారెడ్డి, పరిగి మండల అధ్యక్షుడు నాగవర్థన్, దోమ అధ్యక్షుడు గుడాటి శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News