Monday, December 23, 2024

మౌలిక వసతుల రూపకల్పనే ధ్యేయం

- Advertisement -
- Advertisement -
  • రూ. 7.92 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఆదిభట్ల: తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రగతికి పట్టం కడుతోందని స్థానిక ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నా రు. బుధవారం ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మున్సిపాల్టీ పరిధిలోని పలు వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.

సుమారు రూ.7.92 కోట్ల నిధులతో పనుల నిర్వహణకు ఆయన శ్రీకారం చుట్టా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని అన్నా రు. పట్టణ ప్రగతితో మౌలిక వసతుల రూపకల్పన శరవేగంగా సాగుతోందన్నా రు. నూతనంగా ఏర్పడిన మున్సిపాల్టీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ఆదిభట్ల మున్సిపాల్టీ అధిక నిధులు కేటాయించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా నేడు రూ. 7.92 కోట్ల పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్, మం త్రి కెటిఆర్‌ల దూరదృష్టితో తెలంగాణలోని ప్రతి పట్టణమూ ప్రగతిపధంలో దూ సుకుపోతోందన్నారు. భవిష్యత్తులోనూ మెరుగైన ఫలితాలను సాధించే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ద్ధంగా ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.

క్రీడాప్రాంగణం కోసం స్థల పరిశీలన..

కొంగరకలాన్‌లోని సర్వే నెంబర్ 300లో 3.5 ఎకరాల్లో క్రీడాప్రాంగణ నిర్మాణం కోసం ఎమ్మెల్యే స్థల పరిశీలన జరిపారు. కాగా ఈకార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్‌గౌడ్, వైస్ కోరె కళమ్మ, కమీషనర్ అమరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు మహేందర్, శ్రీనివాస్ వనం, కుంట్ల మౌనిక, సంధ్య, కల్వకోల్ రవీందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు ప్రవీణ్ నర్సగళ్ల, జెర్కోని రాజు, పైళ్ల తిరుమల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, రామారావు, ముక్కెర నారాయణ, కాకి రవీందర్, విద్యావేత్త లక్కరాజు శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News