Monday, December 23, 2024

పట్టణాల అభివృద్ధే ధ్యేయం

- Advertisement -
- Advertisement -

చొప్పదండి: పల్లెల, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బుధవారం చొప్పదండి పట్టణంలోని 5వ వార్డులో అంబేద్కర్ సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుందని అన్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంతో మంచినీటిని అందిస్తు న్నామని అందని గ్రామాలకు త్వరలో అందిస్తామని అన్నారు.

పల్లెలు పచ్చదనంతో ఉండేందుకు హరిత హారం కార్యక్రమం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూటిక తీపించడం జరిగిందన్నారు. నూతనంగా ఏర్పడిన గ్రామాలకు గ్రామ పంచాయితీ భవనాలను మంజూరు చేయించడం జరిగిందన్నారు. కుల సంఘ భవనాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రైతు వేదికలు ఏర్పాటు చేసుకోవడం, స్మశాన వాటికలను నిర్మాణం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈక్ష్మP0 కార్యక్రమంలో సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News