Monday, December 23, 2024

మౌళిక సదుపాయాల కల్పనే ధ్యేయం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయమని హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు గోవిందాపురంలో రూ. 26లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధ్ది పనులకు చైర్మన్ గెల్లి అర్చనరవితో కలిసి ఎమ్మెల్యే శం కుస్ధాపనలు చేశారు. రూ. 10లక్షలతో ఎస్‌సి కమ్యూనిటీహాల్, రూ. 8 లక్షలతో స్మశానవాటిక, రూ. 8లక్షలతో సిసిడ్రేనేజీ పలనుకు శంకుస్ధాపనలు చేసి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ కోట్లాదిరూపాయలతో మున్సిపాలిటీ లోని 28 వార్డుల్లో సిసి రోడ్లు, డ్రేనేజీలు నిర్మించడంతోపాటు మౌళికసదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పట్టణాభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని ప్రతిఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చిలకబత్తిని సౌజన్య,కోలపాటి వెంకటేశ్వర్లు, యరగాని గురవయ్య, యరగాని శ్రీనివాస్, చిట్యాల అమర్‌నాద్‌రెడ్డి, బెల్లంకొండ అమర్, బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు సన్మానం..
పట్టణంలోని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో శనివారం హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ …తమ కులానికి స్మశానవాటిక లేదని స్మశానవాటిక కోసం స్ధలం కేటాయించాలని ఎమ్మెల్యేను కలిసి కోరడం జరిగిందని, ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఊరచెరువు వెంట తమకులానికి స్మశానవాటిక కొరకు స్ధలాన్ని కేటాయించడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News