నల్లగొండ: పల్లెల సమగ్రాభివృద్ధే ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆఎస్ ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్సీ మంకెన చిన్న కోటిరెడ్డి అన్నారు. త్రిపురారం మండలంలోని చెన్నాయిపాలెం గ్రామంలో తన అభివృద్ధి నిధులతో ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్లతోపాటు, సిసి రోడ్లపనులను జడ్పీటిసి ధనావత్ భారతితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృధ్ది సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. దేశం యావత్తు మన రాష్ట్రం వైపు చూస్తుందని అన్నారు.
పల్లెల అభివృధ్ది కొరకు ప్రణాళికా బద్దంగా ప్రత్యేక కార్యాచరణతో నిధులు కేటాయిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధ్ది ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ప్రజలందరూ అభివృద్ధిని చూసి మరోసారి బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. అంతకుముందు గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికి పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి (సాగర్) ఎంపిపి భగవాన్ నాయక్,సర్పంచులు నామరాజు, గజ్జెల కోటిరెడ్డి, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు మార్తి భారత్‌రెడ్డి, అనంతరెడ్డి, బాస్కర్ నాయక్, కొనకంచి సత్యనారాయణ, భరాతి శ్రీనివాస్, శ్యాంసుందర్‌రెడ్డి, ఇండ్ల జానకి రాములు, గోపు కోటిరెడ్డి,బండారు ప్రసాద్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.