Sunday, September 8, 2024

కన్నియ కుమారిలో వెనక్కి వెళ్లిన సముద్రం నీరు?!

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులోని కన్నియ కుమారి ప్రముఖ పర్యాటక క్షేత్రం. ఇక్కడ కుమిరి జిల్లాలో వివేకానంద రాక్, తిరువళ్ళూరు విగ్రహాలున్నాయి. పర్యాటకులు వాటిని దర్శించడానికి మంగళవారం ఉదయం బోటు టిక్కెట్లు కొనుకున్నారు. కానీ ఆ సమయంలో ఉన్నట్టుండి సముద్రం నీరు వెనక్కి వెళ్లింది. దాంతో స్థానికులు, పర్యాటకులు కంగారుపడ్డారు. అప్పుడు పడవలను తాత్కాలికంగా ఆపేశారు. రెండు గంటల తర్వాత పడవలను నడిపారు. ఆదివారం కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.

ఈ మధ్య సముద్రం నీరు ఇలా వెనక్కి వెళ్లడం జరుగుతోంది. తర్వాత మళ్లీ యథాస్థితికి వస్తోంది.ఇలా జరగడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. అలలు కూడా పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. అప్పుడు పడవ ప్రయాణాలను అధికారులు నిలిపేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News