Thursday, January 23, 2025

ఒలంపిక్ రన్ క్రీడాస్ఫూర్తిని చాటి చెప్పాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి : అంతర్జాతీయ ఒలంపిక్ డే సందర్భంగా జిల్లా ఒలంపిక్ డే అసోసియేషన్ కన్వీనర్ వాకిటి శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం ఒలంపిక్ డే రన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చై ర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా అదనపు ఎస్పి షాకీర్ హుస్సేన్‌లు పాల్గొని జ్యోతిని వెలిగించి ఒల ంపిక్ డే రన్‌ను ప్రారంభించారు.

పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పట్టణం నలుమూలల జ్యోతి జాతీయ పథకాలు ప్రదర్శిస్తూ ఒలంపిక్ డే రన్ నిర్వహించారు. ఈ సందర్భ ం గా అతిథులు మాట్లాడుతూ వనపర్తి క్రీడలకు పుట్టినిల్లు అని, మ ంత్రి నిరంజన్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తూ జాతీయ, అంతర్జాతీ య, రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పారితోషకాలు ఇప్పిస్తున్నారన్నారు.

జాతీయ స్థాయిలో సెపక్తక్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఘనపురంకు చెందిన మౌనికకు మూడు లక్షలు, వాలీబాల్‌లో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించిన యశ్వంత్‌కు మూడు లక్షలు, జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్‌లో నిలిచిన భరత్‌కు 2 లక్షల రూపాయలు ప్రత్యేకంగా ఇప్పించారని వాకిటి శ్రీధర్ అన్నారు.

వనపర్తిలో ఒలంపిక్ డే రన్ నిర్వహించడం వనపర్తిలోని క్రీడాస్ఫూర్తికి నిదర్శనమని నిర్వాహకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు ప్రతాప రెడ్డి, క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, ఒలంపిక్ కన్వీనర్ కుమార్, సురే ందర్ రెడ్డి, తిరుపతి, శ్రీకాంత్, నిరంజన్, ఆవుల రమేష్, గంధ ం పురంజ్యోతి, డేనియల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News